Motorola Edge 50 Fusion: మిడ్-రేంజ్ ఫోన్‌లో సరికొత్త డిజైన్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే.! 11 d ago

సాధారణంగా మోటోరోలా ఫోన్‌లు సరసమైన ధరలో మంచి ఫీచర్లను అందిస్తాయి. మోటో ఫోన్‌లలో అది లేదు.. ఇది బాలేదు అని చెప్పడం చాలా కష్టం..అంత సూపర్ గా ఉంటాయి మరి! ప్రస్తుతం నడుస్తున్న 5G యుగానికి తగ్గట్టుగా మోటోరోలా కూడా Edge 50 Fusion పేరుతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎండ్‌లెస్ ఎడ్జ్ పి-ఓఎల్ఈడీ కర్వడ్ డిస్‌ప్లే, మంచి కెమెరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. Motorola Edge 50 Fusion ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి!
Edge 50 Fusion ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 144Hz
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ
ఛార్జింగ్: 68W టర్బో పవర్ ఛార్జింగ్
కెమెరా ఫీచర్లు: ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు (ఫ్రంట్, బ్యాక్).
- బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా (OISతో)
13MP అల్ట్రావైడ్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా: 32MP
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 12GB RAM + 256GB స్టోరేజ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14, HelloUI OS
ఇతర ఫీచర్లు:
- స్టెరియో స్పీకర్లు
- డాల్బీ అట్మోస్
- ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఫోన్ రంగులు:
- మార్ష్‌మెల్లో బ్లూ
- ఫారెస్ట్ గ్రీన్
- హాట్ పింక్
- ఫారెస్ట్ బ్లూ
లోపాలు:
ఈ మొబైల్ లో మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ధర పరిధిలో ఇతర కంపెనీలు మంచి పోటీ ఇస్తున్నాయి. సెల్ఫీ కెమెరాలో బగ్స్ ఉన్నాయి.
చూశారుగా ఇన్ని మంచి ఫీచర్లు ఉన్న ఈ Motorola Edge 50 Fusion రూ.20,999 నుండి లభిస్తుంది. 12GB RAM వేరియెంట్ కావాలంటే ఒక వెయ్యి ఎక్కువ పెట్టాలి. దీని శక్తివంతమైన పనితీరు, ఫాస్ట్ ప్రాసెసింగ్ ద్వారా మంచి గేమింగ్ అనుభవాన్ని పొందొచ్చు. పెద్ద డిస్‌ప్లే, క్లీన్ ఆండ్రాయిడ్ మిడ్-రేంజ్ ఫోన్ కావాలనుకుంటే ఇది మంచి ఎంపిక. ప్రస్తుతం అన్ని చోట్ల ఇది అందుబాటులో ఉంది.
ఇది చదవండి: Mercedes-Maybach SL 680--అల్ట్రా-లగ్జరీ కన్వర్టిబుల్ రోడ్‌స్టర్.! భారత్ లోకి..